వైసీపీ మునిగిపోయే నావ లాంటిదని మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి పేర్కొన్నారు. జగన్ పాలనలో జనం విసిగిపోయారని, రాష్ట్రం అభివృద్ధిలో 20 ఏళ్లు వెనక్కి పోయిందని చెప్పారు. కేసుల నుంచి బయట పడేందుకే సీఎం జగన్ మోదీని కలుస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో కమలాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని తెలిపారు. ఆయన మాట్లాడుతూ.... మార్చిలో కమలాపురం నియోజకవర్గంలోని తన వర్గీయులతో మండలాల వారీగా సమావేశమై టీడీపీలో చేరుతామన్నారు. తనతో పాటు డీఎల్ రవీంద్రారెడ్డి కూడా టీడీపీలోకి వస్తారని చెప్పారు. వైసీపీలో తనను చేర్చుకునేందుకు ఒత్తిళ్లకు గురి చేశారని తెలిపారు.