108 ఉద్యోగుల పై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను దారు ణంగా ఉన్నాయని సీఐటీయూ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు ఆరోపించారు. 108 ఉద్యోగుల స మస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం కలెక్టరేట్ ఎదుట చేపట్టిన రిలే దీక్ష లను ఆయన ప్రారంభించి మాట్లాడారు. అరవింద యాజమాన్యం కార్మిక చట్టాలను తుంగలో తొక్కు తూ పీఎఫ్, ఈఎస్‌ఐ యాజమాన్య వాటాను చెల్లిం చకుండా కార్మికుల వద్ద నుంచే వసూలు చేస్తున్నా ప్రభుత్వం, కార్మికశాఖ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గత 15ఏళ్ళ నుంచి 108లో కష్టపడి పని చేస్తున్న ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు సరిగా లేవన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 108 ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన సీఎం జగన్ ఇప్పుడు విస్మరించారని విమర్శించారు. 108 ఉద్యోగులకు ప్రభుత్వ కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. 108 కాంట్రాక్టు ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్య క్షుడు తాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ తమకు కనీస వేతనాలు అమలు చేయాలన్నారు. ప్రతి నెల జీతంలో చెల్లించడంలో సంస్థ అనుసరిస్తున్న విధా నాల వల్ల ఉద్యోగులు రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కొంతమంది అధికారుల వేధింపుల వల్ల ఎప్పుడు ఉద్యోగం పోతుందో కూడా తెలియని దుస్థితి ఏర్పడిందని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సత్వరమే తమను ప్రభుత్వ ఉ ద్యోగులుగా గుర్తించడంతో పాటు ప్రతినెల వేతనాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాం డ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కా ర్యదర్శి వెన్న గాలిరెడ్డి, ప్రతినిధులు సీహెచ్.భా స్కర్, హరిబాబు, ఆదాం, వాసుబాబు, పి.సురేష్, యోహాన్, శ్రీనివాసరెడ్డి, స్వర్ణ, సునీత, కోటేశ్వరమ్మ, బాబూరావు తదితరులు పాల్గొన్నారు.