‘డబ్బులు ఇవ్వకుంటే నీ న్యూడ్ ఫొటోలు సోషల్ మీడియా, పోర్న్ సైట్లలో పెడతా. స్నేహితులకు పంపిస్తా’నంటూ ఓ ఆగంతకుడు విజయనగరం జిల్లా, పాచిపెంట మండలానికి చెందిన ఓ ఉపాధ్యాయుడ్ని బెదిరించిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. బాధిత ఉపాధ్యాయులు ఫోన్లో ఏ లింక్ నొక్కారో తెలియదు కానీ ఆగంతకుడు హ్యాక్ చేశారు. ఫోన్లో ఉన్న ఫొటోను మార్ఫింగ్ చేసి వాట్సాప్లో పంపించాడు. న్యూడ్ ఫొటో చూసి సదరు ఉపాధ్యాయుడు షాక్ తిన్నాడు. డబ్బులు చెల్లించకుంటే సోషల్ మీడియాలో న్యూడ్ ఫొటోను పోస్ట్ చేస్తామని బెదిరించాడు. రెండు యూపీఐ నెంబర్లు ఇచ్చి.. ఒక్కోదానికి రూ.1200 చెల్లిస్తే ఫైల్ క్లోజ్ చేస్తామని చెప్పాడు. దీనిపై ఫిర్యాదుచేసేందుకు బాధితుడు సిద్ధమవుతున్నాడు.