కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్టు చేసినట్లు ఎస్ఈబీ ఏఈఎస్ ఆయేషా బేగం చెప్పారు. శనివారం అర్బన్ సీఐ జోగేంద్ర, సిబ్బందితో కలసి చిత్తూరు నగరంలోని తేనెబండలో దాడులు నిర్వహించామని చెప్పారు. అదే ప్రాంతానికి చెందిన కన్న ఇంటి సమీపంలో రూ.1.50 లక్షల విలువ చేసే 1,440 కర్ణాటక మద్యం బాటిళ్లు గుర్తించి, అతన్ని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు జయశంకర్ పారిపోగా కన్నను అరెస్టు చేశామని అన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, కన్నను రిమాండ్కు తరలించామని ఏఈఎస్ చెప్పారు.