ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం భూమి పూజ కార్యక్రమం ఆదివారం ఉదయం నిర్వహించారు. ఎదురుగా ఉన్నటువంటి స్థలంలో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు సురేష్ మెరుగు నాగార్జున ఎమ్మెల్యేలు కరణం బలరాం, రాంబాబు, మద్దిశెట్టి వేణుగోపాల్, బాలనేని శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ పోతుల సునీత, రీజనల్ కోఆర్డినేటర్ బేధం మస్తాన్రావు, భూమన కరుణాకర్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు జంకె వెంకటరెడ్డి, పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు.