బొబ్బిలి నియోజకవర్గం తెర్లాం మండలంలో శనివారం మండల స్థాయి అధికారులతో ఎంపీడీవో ఎస్ రామకృష్ణ ఆధ్వర్యంలో కన్వర్జెన్సీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమం లో డిప్యూటీ సీఈవో కే రాజ్ కుమార్ పాల్గొన్నారు. వారితో పాటు మండల శాఖ అధికారులతో ఆయా శాఖ ప్రగతిపై రివ్యూ నిర్వహించారు.
ముందుగా గృహ నిర్మాణ శాఖ ఏఈ ఎం వెంకటేశ్వరరావు తో ఉగాదికి 1400 ఇళ్లు గృహప్రవేశాలు సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు. మండలంలో నాడు నేడు పనులు శత శాతం పూర్తిచేయాలని ఇంజనీరింగ్ అధికారులకు తెలిపారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనాలను తనిఖీ చేసి, విద్యార్థుల హాజరు పట్టీలను నిత్యం తనిఖీ చేయాలనే ఆయన సూచించారు మండల విద్యాశాఖ అధికారికి సూచించారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ కేంద్రాలు, పూర్తిస్థాయిలో చేయాలని పంచాయతీ రాజ్ ఏ ఈ కి సూచించారు.
మండలంలో త్రాగునీరు కొరత లేకుండా చూడాలని గ్రామీణ నీటి సరఫరా ఏఈకి సూచించారు. సఖి గ్రూపు విస్తృతం చేయాలని అంగన్వాడీ సూపర్వైజర్లకు సూచించారు. ఉపాధి హామీలో గరిష్ట వేతనం వచ్చే విధంగా వేతన దారులకు అవగాహన కల్పించాలని ఉపాధి హామీ ఏపీ ఓ కి సూచించారు, రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు విడుదలైన ధాన్యం డబ్బులను రైతులకు ఎప్పటికప్పుడు అందుతున్నది లేనిది పరిశీలన చేయాలని వ్యవసాయ అధికారికి సూచించారు. ఈ కార్యక్రమంలో మన స్థాయి అధికారులు అందరూ అయ్యారని ఆయన తెలిపారు.