పట్టణ పేదరిక నిర్ములన సంస్థ మెప్మా కార్యక్రమంలో భాగంగా పట్టణ మహిళా సమాఖ్య నూతన కమిటీగా ఎన్నికైన సభ్యులు శనివారం ఎమ్మెల్యే అన్నా రాంబాబును మర్యాద పూర్వాకంగా కలిశారు. శనివారం ఎమ్మెల్యే అన్నా నివాసంలో వారు కలిసి ఎమ్మెల్యే అన్నాను సన్మానించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అన్నా మాట్లాడుతూ. పట్టణ సమాఖ్య అభివృద్ధికి కృషి చేయాలనీ సూచించారు. అనంతరం సమాఖ్య సభ్యులను ఎమ్మెల్యే అన్నా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.