ఆదివారం శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న పోలీసు కానిస్టేబుల్ ప్రాధమిక రాత పరీక్ష కేంద్రాల్లో భద్రత ఏర్పాట్లు ను స్వయంగా జిల్లా ఎస్పీ జి ఆర్ రాధిక పర్యవేక్షణ చేసారు. పోలీసు కానిస్టేబుల్ రాత పరీక్ష సందర్భంగా పటిష్టమైన చర్యలు చేపట్టి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. పకడ్బందీగా బందోబస్తు విధులు నిర్వహించాలని పోలీసు అధికారులను ఆదేశించారు.