బాలీవుడ్ స్టార్హీరో షారుఖ్ ఖాన్ తనకు ఆదివారం ఉదయం 2 గంటలకు ఫోన్ చేశారని తెలిపారు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ. గువహటిలో పఠాన్ చిత్రాన్ని ప్రదర్శించే థియేటర్‌పై షారూఖ్ ఆందోళన వ్యక్తం చేయగా, అండగా ఉంటామని హామీ ఇచ్చామని చెప్పారు. అయితే నిన్న జరిగిన ప్రెస్మీట్లో షారుఖ్ ఖాన్ ఎవరో తెలీదని అతను ఫోన్ చేస్తే సమస్యల గురించి ఆలోచిస్తానన్నారు హిమంత. ఆ మరునాడే షారుఖ్ హిమంతకు ఫోన్ చేయడం గమనార్హం.