ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాట్ యే డాగ్... ఆ కుక్క పిల్ల తెలివికి నెెటిిజన్ల ఫిదా

international |  Suryaa Desk  | Published : Sun, Jan 22, 2023, 08:03 PM

ఓ కుక్కపిల్ల ప్రదర్శించిన తెలివి, మంచి మనస్సుకు చెందిన ఓ‌ వీడియోపై నెటిజన్లు పెద్ద ఎత్తున్న స్పందిస్తున్నారు. ఇదిలావుంటే చాలా మంది ఇళ్లల్లో చిన్న చిన్న కుక్క పిల్లల్ని పెంచుకుంటూ ఉంటారు. నిజానికి మంచి స్నేహితులుగా మారిపోతాయి పెంపుడు జంతువులు. పైగా చాలా మంది పెంపుడు జంతువులకి ఏమైనా అయితే అస్సలు తట్టుకోలేరు. ఎంతో జాగ్రత్తగా అల్లారుముద్దుగా సొంత పిల్లల్ని పెంచినట్టే పెంపుడు జంతువులను కూడా పెంచుకుంటూ ఉంటారు. పైగా అవి ఇంట్లో తిరుగుతూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. మంచిగా సమయం కూడా గడిచిపోతూ ఉంటుంది. ఎటువంటి బోర్ కొట్టదు. నిజానికి కుక్కలు మనిషికి బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పొచ్చు. చక్కగా కలిసి తిరుగుతూ ఉంటాయి. ఆడుతూ సందడి చేస్తాయి. అలానే ఒక్కోసారి వాటి ప్రవర్తన చూస్తే మనకి నవ్వు కూడా వస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో పెంపుడు జంతువులకు సంబంధించిన వీడియోలు మనకి కనబడుతూనే ఉంటాయి. చాలా క్యూట్‌గా ఆ వీడియోలు ఉంటాయి. అలాంటి వీడియోలలో ఇది కూడా ఒకటి. తాజాగా ఈ వీడియో వైరల్ అయ్యింది. దీనికి మంచి స్పందన వస్తోంది. ఆ కుక్కపిల్లని చూస్తే ఎవరైనా ఫిదా అయిపోతారు. అదేంటి కుక్కపిల్ల ఇలా చేసిందా అని ఆశ్చర్య పడిపోతారు కూడా.


వీడియోలో కుక్కపిల్ల క్యూట్‌గా వుంది. నిజానికి ఇది క్యూట్‌గా మాత్రమే కాదు, మంచి మనసుని కలిగి ఉంది. ఈ వీడియోలో ఒక ముసలామె కూర్చోవాలని ప్రయత్నిస్తూ ఉంది. కుక్కపిల్ల చక్కగా స్టూల్‌ని ఆమెకి అందేటట్టు జరుపుతూ ఉంది. ఆ తర్వాత ఆమె స్టూల్ మీద కూర్చుంది. ఇలా ఆమె కూర్చోడానికి ఈ కుక్క పిల్ల.. స్టూల్‌ని జరిపి సాయం చేసింది. దానికి ఆ తెలివి తేటలు ఎలా వచ్చాయన్నది నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. వీడియో చూసినవాళ్లు పప్పీకి ఫిదా అయిపోతున్నారు. దాని మంచితనాన్ని ప్రశంసిస్తున్నారు.


చక్కగా క్యూట్‌గా ఈ కుక్కపిల్ల చేసిన పని చూస్తే ఎవరైనా మెచ్చుకుంటారు. ఎంతో అందంగా ఈ వీడియో ఉంది. దీనికి 86 లక్షల వ్యూస్ వచ్చాయి. అలానే టన్నుల కొద్దీ రియాక్షన్స్ వచ్చాయి. "ఈ వీడియో చాలా క్యూట్‌గా ఉంది" అని ఒక సోషల్ మీడియా యూజర్ కామెంట్ చేశారు. "పెద్ద వాళ్ళకి సర్వీస్ చేయడంలో ఈ కుక్క పిల్ల బాగా చేస్తోంది" అని మరొక సోషల్ మీడియా యూజర్ కామెంట్ ఇచ్చారు. "హార్ట్ వార్మింగ్" అని మరో యూజర్ మెచ్చుకున్నారు. "చాలా స్వీట్‌గా వీడియో ఉంది" అని మరో యూజర్ కామెంట్ చేశారు. ఇలా నెటిజన్లు ఆ పప్పీని అభినందిస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa