ఏపీ లో ‘డీజీపీ ఏపీ అఫీషియల్’ పేరిట ఉన్న ట్విటర్ ఖాతాను గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. 2019లో క్రియేట్ చేసిన ఈ ఖాతాలో బాలీవుడ్ స్టార్ సన్నీలియోన్ వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. వాటికి డీజీపీ లైకులు కొట్టినట్టు ఉండటంతో ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఏపీ పోలీస్ టెక్నికల్ టీమ్ రంగంలోకి దిగి సైబర్ కేసు నమోదు చేసింది. 2019లో అప్పటి పోలీస్ ఉన్నతాధికారి ఈ అకౌంట్ క్రియేట్ చేయించి 2020 ఫిబ్రవరి 14తో ఆపేశారు. డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డి వచ్చి ఏడాది అవుతున్నా ఎప్పుడూ దాన్ని చూడలేదు. కాగా, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టెక్నికల్ డీఐజీ పీహెచ్డీ రామకృష్ణ తెలిపారు.