భారత నౌకాదళంలోకి మరో జలాంతర్గామి చేరింది. భారత్ చరిత్రలోనే అత్యంత వేగంగా నిర్మించిన సబ్‌మెరైన్ INS వగీర్ నౌకాదళంలో చేరింది. దీని రాకతో భారత్ సముద్ర శక్తి బలపడింది. ఈ కార్యక్రమంలో నేవీ చీఫ్ అడ్మిరల్ హరికుమార్ పాల్గొన్నారు. ఈ సబ్‌మెరైన్‌తో భారత నౌకాదళ సామర్థ్యాలు మెరుగుపడతాయని, సంక్షోభ సమయంలో నిర్ణయాత్మకమైన ఇంటెలిజెన్స్, నిఘా, పర్యవేక్షణలను అందిస్తుందని నౌకాదళం ఓ ప్రకటనలో పేర్కొంది.