రాబోయే ఎన్నికల్లో వీర మహిళలు, జనసైనికులు కలిసి పోరాడితేనే వైసీపీ పతనం ఖాయమవుతుందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కొణిదేల నాగబాబు అన్నారు. శనివారం అనంతపురం నగరంలోని మౌర్యఇన పరిణయ ఫంక్షన హాలులో వీర మహిళలు, జనసైనికుల సామూహిక సమావేశం అనంతపురం జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు చిలకం మధుసూదనరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యశస్విని, రాష్ట్ర అధికారి ప్రతినిధి రాయపాటి అరుణ హాజరయ్యారు. ఈ సందర్బంగా నాగబాబు మాట్లాడుతూ..... సామాన్యుల కష్టాలు తీర్చడానికే పవన కళ్యాణ్ వచ్చారన్నారు. రాయలసీమలో వైసీపీ గుండాగిరి ఎక్కువైందన్నారు. అసలు వైసీపీ ఒక పార్టీనా..లేక గూండా పార్టీనా? అని విమర్శించారు. పిల్లల భవిషత్తు కోసం పవనను గెలిపించుకునేందుకు నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. గ్రూపు రాజకీయాలకు స్వస్తి పలికి పార్టీని బలోపేతం చేయాలని అన్నారు. పవన ప్రతి పైసా పార్టీ, ప్రజల కోసమే ఖర్చు పెడుతున్నారన్నారు. తమ కుటుంబం పవనకు ఎళ్లవేళలా అండగా ఉంటుందన్నారు. సమావేశంలో అంతకుముందు తమ నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు చేస్తున్న అరాచకాలను మహిళలు, జనసైనికులు నాగబాబుకు వివరించారు. వైసీపీ నాయకులకు జనసేన పార్టీ అంటే వణుకు పుట్టిందని..దీని కోసమే పవనకళ్యాణ్ చేపడుతున్న ప్రతి పనిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. 151 సీట్లు వచ్చాయని విర్రవీగుతున్న జగన గుండెను ఒక్క గ్లాస్‌తో కొడితే పగిలిపోతుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యశస్విని అన్నారు. ఈ సమావేశంలో తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్, పాణ్యం, ఎమ్మిగనూరు నియోజకవర్గాల ఇనచార్జిలు చింతా సురేష్‌బాబు, రేఖాగౌడు, రాయలసీమ వీర మహిళ ప్రాంతీయ కమిటీ సభ్యురాలు హసీనాబేగం, నాయకులు హర్షద్, చల్లావరుణ్,, తేనరనాజు, మల్లయ్య, వెంకప్ప, లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.