ఆళ్లగడ్డ , శిరివెళ్ల మండలంలోని యర్రగుంట్ల గంగుల తిమ్మారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు స్కిల్ హబ్ ద్వారా ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపాల్ రామకృష్ణారెడ్డి, జిల్లా నైపుణ్యాధికారి పీవీ ప్రతాప్‌రెడ్డి శనివారం తెలిపారు. నైపుణ్యాభివృద్ధిలో భాగంగా అకౌంటింగ్ ఎగ్జిక్యూటివ్(ట్యాలీ), డొమెస్టిక్ ఐటీ హెల్ప్ డెస్క్, అటెండెంట్(కంప్యూటర్ కోర్సు, ఐటీ సెక్టార్) కోర్సులకు మూడు నెలల పాటు శిక్షణ ఇస్తామని వారు తెలిపారు. ఈ నెల 23న డిగ్రీ కళాశాలలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.