ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 222 గ్రామాల్లోని గ్రామకంఠాల పరిధిలో ఉన్న ఇళ్లు, ఇళ్లస్థలాల యజమానులకు హక్కు పత్రాలు ఇవ్వనుంది. ఈ నెల చివరి వరకు గ్రామకంఠాల్లోని ఆస్తుల వివరాలతో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఫిబ్రవరి నెలాఖరులో హక్కుపత్రాలను అందించనుంది. అల్లూరి, పశ్చిమ గోదావరి, గంటూరు మినహా మిగతా జిల్లాల్లోని పదేసి గ్రామాల్లో ఈ ప్రక్రియ పూర్తికానుంది.