రాష్ట్రంలో బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరిం చాలని ఏపీ బ్రాహ్మణ సేవా సంఘాల సమాఖ్య అధ్యక్షుడు సత్యవాడ దుర్గాప్రసాద్ కోరారు. ఆదివారం విజయవా డలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కేఎస్ జవహర్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేసి వివరాలు తెలిపారు. రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి చేసేం దుకు కార్పొరేషన్‌కు వెంటనే నిధులు మంజూరు చేయాలని, ఇప్పటివరకు ఖాళీగా ఉన్న బ్రాహ్మణ కార్పొరేషన్ క్రెడిట్ సొసైటీకి చైౖర్మన్‌ను నియమించా లని కోరామని తెలిపారు. మహిళలకు అందించే చేయూత పథకం వయోపరిమితి సడలించాలని, మరిన్ని సమస్యలను జవహర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లామన్నారు. బ్రాహ్మణుల సమస్యలను వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళతామని జవహర్‌రెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa