కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి 52 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లిచేసుకోని విషయం తెలిసిందే. తాజాగా తన పెళ్లి విషయంపై రాహుల్ గాంధీ స్పందించారు. సరైన అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటానని కాంగ్రెస్ రాహుల్ గాంధీ తెలిపారు. ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఏమైనా చెక్ లిస్టు ఉందా అని యాంకర్ అడగగా ప్రేమించే వ్యక్తి బెటర్ అని, ఇంటలిజెంట్ అయితే చాలు అని అన్నారు.