గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలం మహానాడు చెందిన రౌడీ షీటర్ హల్చల్ చేశాడు. వారధి వద్ద లారీని ఆపి బెదిరించి మరీ లారీని రౌడీషీటర్ ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై డ్రైవర్ 100కు ఫిర్యాదు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు లారీని రికవరీ చేశారు. గతంలోను రౌడీ షీటర్‌పై పలు ఆరోపణలు ఉన్నాయి. రాజధానిలో మట్టి దొంగిలించిన కేసులో ప్రథమ ముద్దాయి. అప్పట్లో రౌడీషీటర్‌పై పోలీసులు కేసు నమోదు చేయకుండా వదిలేశారని ఆరోపణలు వినిపించాయి.