వి. ఆర్. పురంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కొనసాగించాలని సిపిఎం రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం మండలంలోని పెద్దమటపల్లి గ్రామం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. సుమారు రెండు గంటల పాటు రోడ్డుపై బైఠాయించి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వెంటనే కొనసాగించాలని, వ్యవసాయ శాఖ అధికారులు స్పందించాలని రాస్తారోకో నిర్వహించారు. అనంతరం రాస్తారోకోని ఉద్దేశించి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనెం సత్యనారాయణ మాట్లాడారు.. ఇప్పటికే ధాన్యం కొనుగోలు చేసి ఆపడం అనేది సరైనది కాదని, ఇంకా రైతుల వద్ద వరి ఉన్నదని అందుకు ధాన్యం కొనుగోలు ఇక్కడ ధాన్యం పూర్తిగా కొనుగోలు చేయాలనీ, ఈ కేంద్రాన్ని కొనసాగించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ఏడాది కొనుగోలు కేంద్రాల వద్ద పనిచేసిన హమాలీలకు ఇవ్వాల్సిన చార్జీలను ఇప్పటిదాకా ఇవ్వలేదని, వెంటనే అట్టి హమాలీ చార్జీలను చెల్లించాలని సంబంధిత అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెట్టి లక్ష్మి, రైతు సంఘం సిపిఎం నాయకులు సోయం చినబాబు, వడ్లది రమేష్, ముసురు వేంకటేశ్వర్లు, కుంజా నాగిరెడ్డి, కల్ము చిన్నయ్య, కారం కమ్మ చిచ్చు, సత్యనారాయణ, గుండె పూడి లక్ష్మణ్ రావు, రాముడు, రామారావు, గుజ్జా శ్రీనివాస్, తుర్రం జోగారావు, తుర్రం వెంకటమ్మ, కుజా బొజ్జీ, బీరబోయిన రాజు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.