పండిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలోను, రైతులను ఆదుకోవడంలోను వైసీపీ ప్రభుత్వం విఫలమైందని టీడీపీ బి.కొత్తకోట టౌన ప్రెసిడెంట్ బంగారు వెంకట్రమణ ఆరో పించారు. ఆదివారం బి.కొత్తకోట నగర పంచాయతీ పరిధిలోని బీసీ కాలనీలో తెలుగుదేశం పార్టీ ఆధ్యర్యంలో ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ నాయకులు ఇంటింటికి వెళ్లిప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ వైపల్యాలను వివరించా రు. ఈ సందర్బంగా టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యనిర్వాహక కార్య దర్శి మస్తాన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఆరాచక పాల న సాగిస్తున్నదని ఆరోపించారు. ప్రజావ్యతిరేక విధానలను అవలం భిస్తున్నదని విమర్శించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కుడుం శ్రీనివాసులు, సుకుమార్, కనకంటి ప్రసాద్, షమీవుల్లా, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.