నాలుగేళ్ల వైసీపీ పాలనలో అరాచకాలు, దౌర్జన్యాలు, భూకబ్జాలు తప్ప చేసిన అభివృద్ధి శూన్యమని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకులూ ముత్తుముల అశోక్‌రెడ్డి విమర్శించారు. ‘ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాత్రి మాజీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి పర్యటించారు. ఎక్సకవేటర్ సహాయంతో భారీ గజమాలతో పార్టీ శ్రేణులు అశోక్‌రెడ్డికి స్వాగతం పలికాయి. అశోక్‌రెడ్డి విక్టరీ సంకేతం చూపుతూ కేడర్‌ను ఉత్సాహపరిచారు. ఈసందర్భంగా ఆయన మాట్లా డుతూ.. ఈ నాలుగేళ్లలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ కోతలు మినహా సంక్షేమం అందించింది లేదని విమర్శించారు. వెనుకబడిన వర్గాలకు మైనారిటీల సంక్షేమానికి తూట్లు పొడిచారని విమర్శించారు. అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. దుల్హన్ పథకం, రంజాన్ తోఫా, సంక్రాంతి, క్రిస్మస్ కానుకలను రద్దు చేశాడని, పేదలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను ఎత్తివేయించాడని విమర్శించారు. టీడీపీ హయాంలో తాను పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కారానికి గుండ్లమోటు నుంచి పైపులైన్ వేసి నీటిని అందించగా తాను మంజూరు చేయించిన నిధులను కూడా తాగునీటికి వెచ్చించలేని పరిస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని విమర్శించారు. ప్రజావ్యతిరేకతను తట్టుకోలేక చంద్రబాబు సభలకు వస్తున్న జనాన్ని చూసి ఓర్చుకోలేక జీవో నెంబరు 1ని తెచ్చాడన్నారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు సయ్యద్ షాన్షావలి, మండలశాఖ అధ్యక్షుడు మార్తాల సుబ్బారెడ్డి, టీడీపీ నాయకులు మస్తాన్, పిడతల రవి, గోపాల్‌రెడ్డి, పెద్దభాషా, చక్రియాదవ్, బిల్లా రమేష్, బోయిళ్లపల్లి కిశోర్, మండ్ల శ్రీనివాసులు, గర్రె సాయినాథ్, బొజ్జా రంగనాథ్ పాల్గొన్నారు.