ముంబైకి చెందిన ఓ యువతి మద్యం మత్తులో తన ఫోన్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసింది. అయితే ఆర్డర్ చేసిన బిర్యానీ ధర రూ.2500 అని తెలిసి షాక్ అయి చూడగా బెంగళూరులోని రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేసుకున్నట్టు చూపించింది. ఆమెకు తర్వాతి రోజు (జనవరి 22)న ఫుడ్ డెలివరీ అయ్యింది. ఈ విషయాన్ని ఆమె ట్వీట్ ద్వారా తెలియజేయగా జొమాటో సైతం స్పందించింది. ఆర్డర్ చేరాక మీ అనుభవం గురించి తెలియజేయండంటూ సరదాగా వ్యాఖ్యానించింది.