ఆన్‌లైన్ లో లూడో ఆడుతూ ఓ పాక్ యువతి, ఓ భారతీయ యువకుడు ప్రేమలో పడ్డారు. యూపీకి చెందిన ములాయం సింగ్ యాదవ్ (26) కు లూడో ఆడుతున్నప్పుడు ఓ పాక్ అమ్మాయి పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ములాయం ఆమెను అక్రమంగా భారత్ కు తీసుకువచ్చాడు. ఇద్దరూ పెళ్లి చేసుకుని బెంగళూరులో ఉంటున్నారు. అయితే ఆమె నకిలీ పత్రాలతో దేశంలో అక్రమంగా ఉంటోందని పోలీసులు తేల్చారు. సోమవారం ఇద్దరినీ బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa