సోంపేట మండలం కర్తలిపాలెం, పొత్రఖండ గ్రామాల్లో సోమవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పిరియా విజయ హాజరై ప్రభుత్వ పథకాల అమలు తీరును పరిశీలించారు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం 157 వ రోజు ప్రజల అవసరాలను గుర్తించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగకరమని ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఇచ్ఛాపురం వైసీపీ సమన్వయకర్త పిరియా సాయిరాజ్ ఉన్నారు.