కేరళలోని ఎర్నాకులంలో నోరో వైరస్ కలవరం పుట్టిస్తోంది. కక్కనాడ్లోని ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన 19 మంది విద్యార్థులకు ఈ వైరస్ వ్యాపించింది. చిన్నారుల తల్లిదండ్రులకు కూడా వైరస్ నిర్ధారణ అయింది. మొత్తం 62 మందిలో వైరస్ లక్షణాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాఠశాలలోని 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్లో తరగతులు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.