కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఆర్పీఎఫ్ జవాన్లను విమానంలో పంపేందుకు కేంద్రం అంగీకరించడం లేదన్నారు. దీంతో 2019 పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు మరణించారు. అనంతరం మాట్లాడుతూ.. సర్జికల్ స్ట్రైక్స్‌పై పార్లమెంట్‌కు కేంద్రం ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదని, అబద్ధాలతో పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. సైన్యాన్ని అవమానించారని పేర్కొంది.