ఆంధ్రప్రదేశ్ లోని రోడ్లపై సీఎం జగన్ సోమవారం సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే ఉన్న రోడ్లన్నింటికీ మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, రోడ్డు నిర్మాణం తర్వాత కనీసం ఏడేళ్లపాటు నిర్వహించాలని సీఎం జగన్ సూచించారు. నగరాలు, పట్టణాల్లో పౌరులు ఫిర్యాదు చేసిన 60 రోజుల్లోగా రోడ్లు బాగు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఏపీసీఎంఎం యాప్ను సీఎం జగన్ ప్రారంభించారు.