ఏపీలో గుడ్స్ రైలు పట్టాలు తప్పింది. కాకినాడ జిల్లా పిఠాపురం- సామర్లకోట వద్ద ఈ ఘటన చోటు చేసుకొంది. విశాఖపట్నం నుంచి విజయవాడ మార్గంలో వెళ్తున్న ఈ గూడ్స్ రైలు ప్రమాదానికి గురైంది. ఇదిలావుంటే గూడ్స్ రైలు పట్టాలు తప్పిన విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది యుద్ధ ప్రాతిపదిక అక్కడికి చేరుకున్నారు. ఘటనా స్థలంలో సిబ్బంది పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. యశ్వంత్పూర్, రత్నాచల్ ఎక్స్ప్రెస్ రైళ్లను రైల్వే అధికారులు నిలిపివేశారు.
అయితే, పట్టాలు తప్పినది గూడ్సు రైలు కావడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే, ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణులు, చిన్నారులు గంటల తరబడి ఎదురుచూడాల్సి రావడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.