టీమిండియా స్టార్ ఆటగాడు మహ్మద్ షమీకి కోల్‌కతా కోర్టు షాక్ ఇచ్చింది. తనతో విడిపోయిన భార్య హసిన్ జహాన్‌కు నెలవారీగా రూ. 1.30లక్షలు చెల్లించాలని షమీని ఆదేశించింది.రూ. 50వేలు హసిన్ జహాన్‌కు వ్యక్తిగత భరణం కింద, మిగిలిన రూ. 80వేలు ఆమెతో ఉంటున్న వారి కుమార్తె పోషణ ఖర్చు నిమిత్తం చెల్లించాలంది. కాగా, 2018లో జహాన్ షమీపై గృహహింస, వరకట్న వేధింపుల ఆరోపణలు చేసింది. తర్వాత భరణం కోసం పిటిషన్ వేసింది.