రిలయన్స్ ఫౌండేషన్ మరియు పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పత్తికొండ మండలం దేవనబండ గ్రామం లో పాడి మహిళా రైతులకు ఉచిత అవగాహన కార్యక్రమం సోమవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ జివాలలో మూడు నెలలు చూడి తరువాత బరువును బట్టి 200 – 300 గ్రాములు దాణాను ఇవ్వాలి , లేకుంటే తక్కువ బరువుగల పిల్లలు జన్మనిస్తాయని తెలియజేశారు.