ఓబులవారిపల్లె మండలం మంగంపేట ఏపీఎండిసి తవ్వకాల కాంట్రాక్టర్ త్రివేణి కంపెనీ ట్రిప్పర్ సోమవారం రాత్రి ప్రొడక్షన్ వే బ్రిడ్జిల వద్ద అన్లోడ్ చేసి తగ్గులో నీరు ఎక్కువగా ఉండటం వల్ల బ్రేక్ వేసినా బ్రేకులు పడక టైర్లు జారడం, ముందు బండిని తప్పించబోయి సైడ్ మళ్ళించడంతో నెమ్మదిగా వాలిపోయినది. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. త్రివేణి కంపెనీ యాజమాన్యం బండ్లను మైంటైన్ చేసి కండిషన్లో ఉంచి భవిష్యత్తులో ఇటువంటి సంఘటన జరగకుండా జాగ్రత్తగా పడాలని కార్మికులు కోరుతున్నారు.