పుస్తకాల పేపర్ల మధ్యలో అమెరికా కరెన్సీ నోట్లు పెట్టి అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు విదేశీయులను ముంబై కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. పేపర్ల మధ్య దాచిన మెుత్తం 90,000 అమెరికన్ డాలర్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే పేస్టు రూపంలో ఉన్న బంగారాన్ని కూడా వీరి దగ్గర నుంచి స్వాధీన పరచుకున్నారు. నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు అధికారులు.