గుంటూరు పట్టణంలో, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఒక ప్రభుత్వ అధికారి జారీ చేసిన 1998 మెమోను రద్దు చేయాలని కోరుతూ దళిత, క్రైస్తవ నాయకులు జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డికి వినతి పత్రాలు అందజేశారు. సోమవారం దళిత క్రైస్తవ సంఘాల నేతలు మాట్లాడుతూ. క్రైస్తవ మార్గాన్ని అనుసరించి చర్చికి వెళ్లే దళితులకు రిజర్వేషన్ వర్తించదని 1998 మెమోలో ప్రధాన అంశమని అన్నారు. ఈ కార్యక్రమంలో వాసి మళ్ళ విజయ్, ఈమని చంద్రశేఖర్, హేబేలు పాల్గొన్నారు