ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భూ సమస్యలపై ఆర్డీవోకు సిపిఎం నాయకులు వినతి పత్రం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 24, 2023, 01:48 PM

పేదల సాగులో ఉన్న ప్రభుత్వ భూములపై వారికే పట్టాలు ఇవ్వాలని సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఆర్‌డిఒ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు పి. శంకరరావు మాట్లాడుతూ రామభద్రపురం మండలం గొల్లలపేట రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్‌ 210లో ఎకరా భూమిని పువ్వల తిరుపతిరావు 30 ఏళ్ల నుండి సాగు చేసుకొంటున్నారని, నేటికీ పట్టా మంజూరు చేయలేదని తెలిపారు. ఇదే సర్వే నెంబర్‌లో 11 ఎకరాలు ఒక రిటైర్డ్‌ ఉద్యోగికి మూడు బినామీ పేర్లతో రికార్డుల్లో చేయించుకొని కబ్జా చేశారని తెలిపారు. గొల్లలపేట పంచాయతీ పరిధిలో సెంటు భూమి లేని నిరుపేదలు ఉన్నారని, వారిని గుర్తించి పంపిణీ చెయ్యాలని ఆర్‌డిఒ పి. శేషశైలజకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సిపిఎం రామభద్రపురం మండల కార్యదర్శి బి. శ్రీనివాసరావు, గ్రామస్తులు పి. తిరుపతిరావు, సి. హెచ్‌. కృష్ణవేణి, పి. అడివమ్మ, పి. గంగమ్మ, సి. హెచ్‌. పారమ్మ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com