దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.4గా నమోదైంది. లక్నో, ఉత్తరాఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఈ భూప్రకంపనలు కనిపించాయి. నేపాల్‌లో రిక్టర్ స్కేల్‌పై 5.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది. ఆ ప్రభావం ఢిల్లీపైనా పడిందని పేర్కొంది. నేపాల్‌లోని కాళికా ప్రాంతం భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించింది.