యూజర్లకు చేరువయ్యేందుకు వాట్సాప్ కొత్త కొత్త ఫ్యూచర్ల రూపకల్పన చేస్తోంది. ఇలా వాట్సాప్ ఎల్లప్పుడూ కొత్త ఫీచర్లను అభివృద్ధిని చేస్తూ, యూజర్లకు అత్యంత అనుకూలమైన వేదికగా మారేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ఈ క్రమంలో మరో కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. తేదీల వారీగా సందేశాలను అన్వేషించి గుర్తించొచ్చు. కొత్త అప్ డేట్ ద్వారా ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్లకు ఈ ఫీచర్ తీసుకొచ్చింది. యూజర్లు ముందు తమ ఫోన్ లో ఉన్న వాట్సాప్ యాప్ ను అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
మీకు మీరే సందేశాన్ని పంపించుకోవచ్చు. ఈ ఫీచర్ కూడా వాట్సాప్ యాప్ అప్ డేషన్ తో అందుబాటులోకి రానుంది. ఇతర యాప్స్ లో ఉన్న వీడియో, ఫొటోలు, డాక్యుమెంట్లను వాట్సాప్ ద్వారా షేర్ చేసుకోవాలని అనుకుంటే.. వేరే యాప్ లో ఉన్న వాటిని డ్రాగ్ చేసి తీసుకొచ్చి వాట్సాప్ లో డ్రాప్ చేసే ఫీచర్ కూడా తాజా అప్ డేట్ తో అందుబాటులోకి వస్తుంది.
వాట్సాప్ లో తేదీల వారీ సందేశాలు, మీడియా కంటెంట్ ను సెర్చ్ చేసుకునేందుకు పైన సెర్చ్ బార్ కు వెళ్లాలి. అక్కడ తేదీ, నెల, సంవత్సరం టైప్ చేస్తే చాలు ఆ రోజున ఏఏ కాంటాక్టులతో ఏమేమి షేర్ చేసుకున్నారనే వివరాలు వస్తాయి. అలాగే, చాట్ విండో ఓపెన్ చేసి, సెర్చ్ మెస్సేజ్ ను సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ కుడిచేతివైపు కార్నర్లో కేలండర్ ఐకాన్ కనిపిస్తుంది. కావాల్సిన తేదీని అక్కడ ఎంపిక చేసుకుంటే ఆ రోజు మెస్సేజ్ లు అక్కడ కనిపిస్తాయి. సమీప భవిష్యత్తులో మీడియా కంటెంట్ ను ఒరిజినల్ సైజు వే వాట్సాప్ లో పంపుకునేందుకు అవకాశం ఏర్పడనుంది.