ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అస్వస్థతకు గురైన తెల్లం బాలరాజు ...ఐసీయూలో చికిత్స

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 24, 2023, 08:09 PM

తమ ఎమ్మెల్యే అస్వస్థతకు గురవ్వడంతో పోలవరం ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.  ఇదిలావుంటే పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అస్వస్థత గురై.. రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. సోమవారం నుంచి చాతి నొప్పి రావడంతో.. కుటుంబసభ్యులు ఆయన్ను రాజమండ్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం.. బాలరాజుకు వెంటనే స్టంట్ వేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని.. ఎమ్మెల్యే బాలరాజు కు వైద్యం చేసిన కార్డియాలజిస్ట్ శరత్‌చంద్ర ప్రకటించారు. 48 గంటలు ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలని వెల్లడించారు.


బాలరాజు ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని.. ఆయన భార్య రాజ్యలక్ష్మి చెప్పారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని.. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని.. త్వరలోనే నియోజకవర్గంలో కార్యక్రమాలకు హాజరవుతారని చెప్పారు. అయితే.. ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అస్వస్థతకు గురవ్వడంతో.. పోలవరం  ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన అనుచరులు భారీగా ఆసుపత్రి వద్దకు వెళ్లారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com