రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతే ఎల్ సిసి భారత్ చేరుకున్నారు. ఐదుగురు కేంద్ర మంత్రులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. బుధవారం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్‌లతో అబ్దెల్ భేటీ కానున్నారు. గణతంత్ర వేడుకలకు ఈజిప్టు అధ్యక్షుడు ముఖ్య అతిథిగా రావడం ఇదే తొలిసారి. ఆయన పర్యటన ఈ నెల 27 వరకు కొనసాగనుంది.