మణిపూర్ భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడు ఎల్ రమేశ్వర్ సింగ్ను తౌబల్ జిల్లాలోని క్షేత్రి లైకై ప్రాంతంలోని అతని నివాసానికి సమీపంలో గుర్తు తెలియని సాయుధ దుండగులు కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుండగులు రెండు బుల్లెట్లు కాల్చారు. వీరిని పట్టుకునేందుకు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. కేసు కూడా నమోదు చేశారు. బీజేపీ మణిపూర్ అధికారిక ట్విటర్ హ్యాండిల్ ఈ ఘటనను ఖండిస్తూ, దోషులను న్యాయస్థానం ముందు నిలబెట్టి తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేసింది.