కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మంగళవారం రాష్ట్రంలో నిర్వహించనున్న 'ఏరో ఇండియా 2023' గురించి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ఆన్లైన్ సమావేశంలో పాల్గొన్నారు.బొమ్మై మాట్లాడుతూ.. 'రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఆర్మీ చీఫ్‌లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమావేశంలో పాల్గొన్నాను. ఫిబ్రవరి 13న ప్రారంభం కానున్న 'ఏరో ఇండియా' ప్రతిష్టాత్మక కార్యక్రమం. 1996 నుంచి కర్ణాటక ఆతిథ్యం ఇస్తోంది అని తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన అపెక్స్ కమిటీ సమావేశంలో రాబోయే ఏరో ఇండియా సన్నాహాలను రాజ్‌నాథ్ సింగ్ సమీక్షించారు. ఫిబ్రవరిలో కర్ణాటకలోని బెంగళూరులో జరగనున్న ఆసియాలోనే అతిపెద్ద ఏరో షో 14వ ఎడిషన్ ఏర్పాట్లను రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించారు.