తులసిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. తులసి ఆకులను తినడం వల్ల గుండెల్లో మంట, అజీర్ణం మరియు అసిడిటీ నయమవుతాయని చెబుతారు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్, బీపీ, మలబద్ధకం, ఉదర సమస్యలు మరియు నోటి దుర్వాసన సమస్యలు తగ్గుతాయని సూచిస్తున్నారు. తులసితో చర్మం కూడా కాంతివంతంగా మారుతుందని అంటారు.