యూకేలో స్థిరపడిన యువతి భారత్ లో తన సోదరుడి వివాహానికి హాజరై తన కుటుంబాన్ని సర్ ప్రైజ్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. తన వివాహానికి సోదరి రాలేదన్న నిరాశతో ఉన్న వరుడు, ఆమెను చూసి ఆనందంలో మునిగిపోయాడు. సోదరిని ఆలింగనం చేసుకొని భావోద్వేగానికి గురయ్యాడు. ఈ వీడియోను ఆ యువతి తన ఇన్ స్టాగ్రాంలో పోస్టు చేయగా కొద్ది రోజుల్లోనే దాదాపు 3 లక్షల వ్యూస్ వచ్చాయి.