ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 28న విశాఖపట్నంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటల వరకు శారదా పీఠంలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం అక్కయ్యపాలెంలో అనకాపల్లి ఎంపీ సత్యవతి వివాహ వేడుకకు హాజరవుతారు. తర్వాత విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నివాసానికి వెళ్తారు. ఇటీవల పెళ్లైన ఎంపీ కుమారుడు శరచ్ చౌదరి, కోడలు జ్ఞానితలను సీఎం ఆశీర్వదిస్తారు.