ఈ వారంలో 5 రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు. నేడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా బ్యాంకులకు సెలవు. 27వ తేదీన బ్యాంకులు పనిచేస్తాయి. 28న నాలుగో శనివారం, 29 ఆదివారం సెలవు. 30,31 తేదీల్లో బ్యాంకు ఉద్యోగులు పెన్షన్ అప్డేట్స్, నేషనల్ పెన్షన్ సిస్టమ్ రద్దు, వారానికి 5 రోజులు పనిదినాలు డిమాండ్లతో సమ్మె చేయనున్నారు. దీంతో ఈ వారంలో 27న మాత్రమే బ్యాంకులు పనిచేస్తాయి.