పాముతో ఫోటో తీసుకోవాలన్న సరదా యువకుడి ప్రాణం తీసింది. ప్రకాశం జిల్లా బొద్దికూరపాడుకు చెందిన మణికంఠారెడ్డి(23) కందుకూరులోని ఆర్టీసీ డిపో సమీపంలో లస్సీ దుకాణం నిర్వహిస్తున్నాడు. మంగళవారం ఓ వ్యక్తి పామును ఆడిస్తూ షాప్ వద్దకు వచ్చాడు. దీంతో పామును మెడలో వేసుకొని ఫోటో దిగాలని మణికంఠ సరదా పడ్డాడు. ఫోటో తీసుకునే క్రమంలో పాము కాటు వేసింది. దీంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa