విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డి పాల్గొన్నారు. గవర్నర్ జాతీయ జెండా ఆవిష్కరించి, పోలీసు దళాల నుండి గౌరవ వందనం స్వీకరించారు. గవర్నర్ బిశ్వభూషణ్ మరికాసేపట్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.