నేటి నుండి ప్రాంతీయ భాషల్లో సుప్రీంకోర్టు తీర్పులను అందుబాటులో ఉంచనుంది. రాజ్యాంగంలో ఉన్న 22 భాషల్లోనూ తీర్పులను వెలువరించనుంది. ఎలక్ట్రానిక్స్ సుప్రీంకోర్టు రిపోర్ట్స్ (E-SCR) ప్రాజెక్టులో భాగంగా 22 భాషల్లోనూ తీర్పులను అందుబాటులో ఉంచనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 34,000 తీర్పులు పొందవచ్చు. వీటిలో 1,268 తీర్పులు సుప్రీంకోర్టు వెబ్ సైట్, యాప్ లో ప్రాంతీయ భాషల్లో నేటి నుండి అందుబాటులోకి వస్తాయి.