అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఉన్న నిషేధాన్ని ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ ఎత్తివేశాయి. 2021లో యూఎస్ క్యాపిటల్‌పై జరిగిన దాడి తర్వాత ఆయనను ఈ సామాజిక మాధ్యమాలు బ్యాన్ చేశాయి. దాదాపు రెండేళ్ల తర్వాత ఆయన అకౌంట్లపై నిషేధం ఎత్తివేస్తున్నట్లు ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల మాతృసంస్థ మెటా ప్రకటించింది. ప్రజలు ఇకపై తమ రాజకీయ నాయకులు ఏం చెబుతున్నారో వినవచ్చు అని పేర్కొంది.