ఎస్టీల జీవితాలు, ఆర్థిక వ్యవస్థలో మార్పు రావాలంటే విద్యతోనే సాధ్యమని ఏ. పి. ఎస్టీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ కుంభా రవిబాబు చెప్పారు. బాపట్ల జిల్లాకు వచ్చిన ఆయన బుధవారం స్థానిక ఇంటిగ్రేటెడ్ గిరిజన బాలి కల సంక్షేమ వసతి గృహాన్ని పరిశీలించారు. దాదాపు గంట సమయం వసతిగృహంలోనే ఉండి విద్యార్థినీ లతో చర్చించారు. వసతి గృహంలో అందుతున్న భోజనం, వసతి సదుపాయాలపై విద్యార్థినీలను అడిగి తెలుసుకున్నారు. గిరిజన సంక్షేమ అధికారులు, సి బ్బందిని మందలించారు. అనంతరం మీడియాతోనూ ఆయన మాట్లాడారు.
వసతి గృహంలో విద్యనభ్యసించడానికి పేద విద్యా ర్థినీలకు అనుకూలమైన పరిస్థితులపై ఏ. పి. ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఆరాతీశారు. తరగతులవారీగా విద్యార్థి నీలతో ఆయన మాట్లాడారు. విద్యార్థినీల సంఖ్య తక్కువగా ఉండడంపై సంబంధిత అధికారులను ప్రశ్నించారు. 323 సీట్ల సామర్థ్యం ఉన్న వసతిగృ హంలో కేవలం 125 మంది విద్యార్థినీలు ఉండడంపై ఆరాతీశారు. వసతిగృహ నిర్వహణపై సంబంధిత అధికా రులను వివరాలు అడగ్గా సమాచారం లేదనడం, దస్త్రా లు అందుబాటులో లేవని చెప్పడంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. పదో తరగతి విద్యార్థినీలతో ఆంగ్ల పాఠ్యపుస్తకాలను చదివించారు. విద్యార్థినీలు సక్రమంగా చదవలేకపోవడంతో అధికారులు ఏం చేస్తున్నారని తప్పుపట్టారు. విద్యార్థినీలకు ఆయన పలు ప్రశ్నలు వేయగా సరైన సమాధానం చెప్పలేక పోవడంతో అసహనం వ్యక్తంచేశారు. విద్యా ప్రమా ణాలు సక్రమంగా పాటించకపోతే విద్యార్థినీల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.
గత ఏడాది పదో తరగతి ఉత్తీర్ణత దస్త్రాన్ని ఆయన పరిశీలించారు. 122 మందికిగానూ 74 మంది మాత్రమే ఉత్తీర్ణులు కావడం ఏమిటని అధికారులను నిలదీశారు. ఉత్తీర్ణత 56 శాతానికి మించకపోవడం అధికారుల పర్యవేక్షణ లోపమే కారణమన్నారు. విద్యార్థినీలకు వండి పెట్టే అల్పాహారం, భోజనం మెనూ ఛార్ట్ లేకపోవడంపై సిబ్బందిని మందలించా రు. జగనన్న విద్యాకానుక కిట్లు విద్యార్థినీలకు అందాయా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వం ఉన్నత లక్ష్యంతో వసతిగృహాలను నడుపుతుంటే అధికారులు, సిబ్బంది సక్రమంగా పట్టించుకోరా అంటూ నిలదీశారు. నాల్గవతరగతి ఉద్యోగి డి. ధనలక్ష్మిని ఇన్ఛార్జి వసతిగృహ సంక్షేమ అధికారిని వార్డెన్గా నిబంధనలు ఉల్లంఘించి ఎలా నియమించారని డి. టి. డబ్ల్యు. ఓ. ను ప్రశ్నించారు. తక్షణమే రాష్ట్ర ఉన్నతాధికారులతో ఛైర్మన్ ఫోనులో మాట్లాడి నాల్గవతరగతి ఉద్యోగిని తొలగించి హెచ్. డబ్ల్యు. ఓ. ను నియమించాలని సూచించారు.
గిరిజన వసతిగృహాలలో విద్యాప్రమాణాలు దిగజారడానికి అధికారుల పర్యవేక్షణ లోపమన్నారు. వసతిగృహాలను నిరంతరం పర్యవేక్షిస్తూ అధికారులు నిబద్ధతతో పనిచేయాలని హెచ్చరించారు. సమాజానికి దూరంగా అణిచివేతకు గురవుతున్న ఎస్టీల బతుకులు మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషిచేస్తుందని ఏ. పి. ఎస్టీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ కుంభా రవిబాబు తెలిపారు. ఎస్టీలకు ఏ సమస్య ఏ వచ్చినా పరిష్కరిం చడానికి ఎస్టీ కమిషన్ నిరంతరం పనిచేస్తుం దన్నారు. ఎస్టీల ఆత్మగౌరవాన్ని పరిరక్షించడానికి చర్యలుతీసు కుంటున్నట్లు వివరించారు. ఏ ప్రాంతంలోనైనా ఎస్టీలకు ఏ కష్టం వచ్చినా కమిషన్ ను సంప్రదించ వచ్చని ఆయన తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బి. సి. లు బాగా చదవాలని విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక నిధులు కేటాయిస్తుందన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ప్యాచూర్యం పొందిన 200 విశ్వవిద్యాలయాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి విదేశీ విద్యను ఉచితంగా అందిస్తుందన్నారు. ఇందుకోసం ఒక్కొక్క విద్యార్థికి రూ. 50 లక్షల నుంచి రూ. ఒక కోటివరకు ఖర్చు చేయడానికి ప్రభుత్వం వెనుకాడ టంలేదన్నారు. ప్రభుత్వం కల్పించే అవకాశాలను సద్వినియోగం చేసుకొని విద్యార్థినీలు ఉన్నతస్థాయికి చేరుకోవాలన్నారు. ఎస్టీలలో మార్పుతెచ్చేందుకు రాష్ట్రముఖ్యమంత్రి వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి గిరిజన విశ్వవిద్యాలయం, గిరిజన సూపర్ స్పెషాల్టి ఆసుప త్రులను ఏర్పాటు చేస్తున్నారని వివరించారు. బాపట్ల వసతిగృహంలో అన్ని మౌలిక సదుపాయాలతో మంచి వసతి కల్పిస్తున్నప్పటికీ పేద విద్యార్థినీలకు నాణ్యమైన విద్య అందించలేకపోవడం బాధకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలు, నిర్ణయాలకు తగినట్టుగా అధికారులు నిబద్ధతతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో డిఎస్పీ శ్రీనివాసరావు, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి షేక్. సైదాదస్తగిరి, వసతి గృహ సంక్షేమ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.