మంగళగిరి తహశీల్దార్ జీవి రామ్ ప్రసాద్ కు సేవా పురస్కారం లభించింది. ఈ మేరకు గురువారం గుంటూరులో జరిగిన 74వ గణతంత్ర వేడుకల్లో జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి చేతుల మీదుగా ఈ సేవా పురస్కారాన్నిఅందుకున్నారు. జీవి రాంప్రసాద్ కరోనా రెండు దశల్లో కోవిడ్ 19 ఇన్సిడెంట్ కమాండర్ గా ప్రజలకు విశేషమైన సేవలు అందించారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించడంలో ఆయన సఫలీకృతులయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకోవటం పట్ల పలువురు అధికారులు, తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది అభినందనలు తెలిపారు.